4 కెమెరాల ఫోన్ రూ.8,999కే.. రియల్‌మీ నుంచి - MicTv.in - Telugu News
mictv telugu

4 కెమెరాల ఫోన్ రూ.8,999కే.. రియల్‌మీ నుంచి

January 9, 2020

Realme 5i.

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ.. 5 సిరీస్‌లో భాగంగా రియల్‌మీ 5ఐ పేరుతో మరో బడ్జెట్ ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.8,999 మాత్రమే. ఈ ఫోన్ ఇప్పటికే వియత్నాంలో విడుదలైంది. ఇండియాలో జనవరి 15న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లో సేల్ ప్రారంభం అవుతోంది. ఈ ఫోన్ కొనుగోలు చేసిన రిలయెన్స్ జియో వినియోగదారులకు రూ.7,550 విలువైన బెనిఫిట్స్ లభిస్తాయి. దాంతో పాటు క్యాషిఫై, మొబీక్విక్ నుంచి ఆఫర్స్ ఉన్నాయి.

రియల్‌మీ 5ఐ ఫీచర్లు

 

* 6.52 అంగుళాల డిస్‌ప్లే,

* 4జీబీ ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ 64జీబీ,

* స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్,

* 12+8+2+2 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా,

* 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా,

* 5000 ఎంఏహెచ్ బ్యాటరీ,

* ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్.