మార్కెట్‌లోకి రియల్‌మీ 7ఐ.. 10శాతం డిస్కౌంట్‌తో - MicTv.in - Telugu News
mictv telugu

మార్కెట్‌లోకి రియల్‌మీ 7ఐ.. 10శాతం డిస్కౌంట్‌తో

October 8, 2020

bngnfg

ప్రముఖ చైనీయ స్మార్ట్ ఫోన్ తయారీదారు రియల్‌మీ మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. రియల్‌మీ 7 సిరీస్‌లో భాగంగా రియల్‌మీ 7ఐ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. తక్కువ ధరకే ఎక్కువ బ్యాటరీ, కెమెరాలు ఈ  ఫోన్ సొంతం. ఈ ఫోన్ రెండు మెమొరీ వేరియంట్‌లలో లభించనుంది. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ ధరను రూ.11,999గా నిర్ణయించగా.. 4జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ ధరను రూ.12,999 నిర్ణయించారు. ఈ ఫోన్ సేల్స్ అక్టోబరు 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రియల్‌మీ.కామ్, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్లలో ఈ ఫోన్ లభ్యం కానుంది. ఈ నెల 16నుంచి ప్రారంభం కానున్న ఫ్లిప్‌కార్ట్‌ బిలియన్ డేస్‌లో ఈ ఫోన్‌పై ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డుతో 10శాతం డిస్కౌంట్ తోపాటు పేటీఎంపై క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

 

రియల్‌మీ 7ఐ  ఫీచర్లు

 

* 6.50 అంగుళాల హెచ్‌డీ పంచ్ హోల్ డిస్‌ప్లే,

* క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్,

* 64+8+2+2ఎంపీ రియర్ క్వాడ్ కెమెరా సెటప్,

* 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా,

* 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 

* ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం.