రియల్‌మీ నుంచి మరో ఫోన్.. ధర, ఫీచర్లు ఇవే! - MicTv.in - Telugu News
mictv telugu

రియల్‌మీ నుంచి మరో ఫోన్.. ధర, ఫీచర్లు ఇవే!

October 27, 2020

price

ప్రముఖ చైనీయ స్మార్ట్‌ఫోన్ తయారీదారు రియల్ మీ ఇండియాలో మరో ఫోన్‌ను లాంచ్ చేయడానికి సిద్ధం అవుతోంది. రియల్ మీ సీ17 పేరుతో ఈ ఫోన్‌ను ఇప్పటికే కొన్ని దేశాల్లో విడుదల చేసింది. నవంబర్ నెలాఖరులో ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ కానుంది. బంగ్లాదేశ్‌లో ఈ ఫోన్ ధరను 15,990 టాకాలుగా(భారతీయ కరెన్సీలో సుమారు రూ.13,800) నిర్ణయించారు. ఇందులో 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. నేవీ బ్లూ, లేక్ గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ లభ్యం కానుంది.

 

రియల్ మీ సీ17 ఫీచర్లు

 

* 6.5 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే,

* ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 460 ప్రాసెసర్,

* 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 

* 13+8+2+2 మెగా పిక్సెల్ క్వాడ్ రేర్ కెమెరా సెటప్, 

* 8 మెగా పిక్సెల్ సెల్పీ కెమెరా, 

* ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం,

* 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.