రూ.3000కే రియల్‌మీ డ్యూయల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ - MicTv.in - Telugu News
mictv telugu

రూ.3000కే రియల్‌మీ డ్యూయల్ కెమెరా స్మార్ట్‌ఫోన్

January 8, 2020

hn v

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ సీ2ఎస్ పేరుతో మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రూ.3,000 ధర మాత్రమే ఉన్న ఈ ఫోన్‌లో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ కెమెరా, ఫేస్ అన్‌లాక్ వంటి ఎన్నో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ను రియల్‌మీ తొలుత థాయ్‌లాండ్‌లో విడుదల చేసింది. అక్కడ దీని ధరను 1,290 బాత్(భారత కరెన్సీలో సుమారు రూ.3,065)లుగా నిర్ణయించారు. 4జీ వోల్టే, బ్లూటూత్, వైఫై, డ్యూయల్ సిమ్, మైక్రో యూఎస్ బీ పోర్ట్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ప్రస్తుతానికి థాయ్‌లాండ్‌లో మాత్రమే అందుబాటులో ఉండనున్న ఈ ఫోన్ మిగతా దేశాల మార్కెట్లలో ఎప్పుడు విడుదల అవుంతుందనే దానిపై ఎటువంటి సమాచారం లేదు. 

 

రియల్‌మీ సీ2ఎస్ ఫీచర్లు

 

* 6.1 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 

* యాస్పెక్ట్ రేషియో 19.5:9, 

* ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్,

* 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్,

* 13+2 మెగా పిక్సెల్ రేర్ డ్యూయల్ కెమెరా సెటప్, 

* 5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా,

* 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ,

* ఆండ్రాయిడ్ 9 పై.