కేవలం రూ.13 వేలకే 5జీ ఫోన్! - MicTv.in - Telugu News
mictv telugu

కేవలం రూ.13 వేలకే 5జీ ఫోన్!

October 13, 2020

mbmgvm

ప్రముఖ చైనీయ స్మార్ట్‌ఫోన్ తయారీదారు రియల్‌మీ మరో సంచలనానికి తేరా లేపింది. ఇప్పటికే ఎన్నో బడ్జెట్ ఫోన్లను తీసుకొచ్చిన ఈ సంస్థ తాజాగా కేవలం రూ. 13వేలకే 5జీ ఫోన్‌ను లాంచ్ చేసింది. రియల్‌మీ క్యూ2, రియల్‌మీ క్యూ2 ప్రో, రియల్‌మీ క్యూ2ఐ స్మార్ట్‌ఫోన్లు లాంచ్ చేసింది. ఈ మూడు ఫోన్లు 5జీకి సపోర్ట్ చేస్తాయి. రియల్ మీ క్యూ, రియల్ మీ క్యూ2 ప్రోలు రెండు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లలో లభ్యం కానున్నాయి. రియల్ మీ క్యూ2ఐలో ఒక్క స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే లభ్యం కానుంది. ఇక ఈ ఫోన్ల ధరల విషయానికి వస్తే.. రియల్‌మీ క్యూ 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,200 ఉండగా.. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.15,200గా ఉంది. రియల్‌మీ క్యూ2 ప్రో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,799 రూ.19,600 ఉండగా.. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,800గా ఉంది. రియల్‌మీ క్యూ2ఐ 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ.13,000గా నిర్ణయించారు. ప్రస్తుతం చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్లు త్వరలో ఇండియాలోకి రానున్నాయి.

 

రియల్ మీ క్యూ2 ఫీచర్లు..

 

* 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే,

* అక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్,

* 48+8+2 మెగా పిక్సెల్ ట్రిపిల్ రేర్ కెమెరా సెటప్, 

* 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా,

* 5000 ఎంఏహెచ్ బ్యాటరీ,

* ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం.

 

రియల్ మీ క్యూ2 ప్రో ఫీచర్లు

 

* 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లే,

* అక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్,

* 48+8+2 మెగా పిక్సెల్ ట్రిపిల్ రేర్ కెమెరా సెటప్, 

* 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా,

* 4300 ఎంఏహెచ్ బ్యాటరీ,

* ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం.

 

రియల్ మీ క్యూ2ఐ ఫీచర్లు

 

* 6.5 అంగుళాల డిస్ ప్లే,

* మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్,

* 13+2+2 మెగా పిక్సెల్ రేర్ కెమెరా సెటప్,

* 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా,

* 5000 ఎంఏహెచ్ బ్యాటరీ,

* ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం.