రియల్‌మీ నుంచి కొత్త ఫోన్.. నేడే మొదటి సేల్ - MicTv.in - Telugu News
mictv telugu

రియల్‌మీ నుంచి కొత్త ఫోన్.. నేడే మొదటి సేల్

September 25, 2020

bnmv

ప్రముఖ చైనీయ మొబైల్ తయారీదారు రియల్‌మీ మరో ఫోన్‌ను లాంచ్ చేసింది. రియల్‌మీ నార్జో 20 ప్రో పేరుతో తీసుకుని వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్ ఈరోజు జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ వెబ్‌సైట్ల ద్వారా ఈ సేల్ జరుగనుంది. ఈ ఫోన్‌లో 65వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.16,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ బ్లాక్ నింజా, వైట్‌నైట్ రంగుల్లో లభ్యం కానుంది.

రియల్‌మీ నార్జో 20 ప్రో ఫీచర్లు 

 

* 6.5 అంగుళాల హెచ్‌డీ+ అల్ట్రా స్మూత్ డిస్‌ప్లే,

* మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్,

* 48+8+2+2 మెగా పిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్, 

* 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా,

* ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం, 

* 4500 ఎంఏహెచ్ బ్యాటరీ.