రియల్‌మీ టీవీ టీజర్..విశేషాలు ఇవే..
మరో స్మార్ట్ ఫోన్ టీవీ తయారీ రంగంలోకి అడుగుపెడుతోంది. ఇప్పటికే ఆపిల్, రెడీమి, వన్ ప్లస్ మొదలగు కంపెనీలు టీవీలను ఉత్పత్తి చేస్తున్న సంగతి తెల్సిందే. తాజాగా రియల్ మీ కూడా టీవీలను తయారు చేస్తోంది. ఈ సంస్థ త్వరలో లాంచ్ చేయనున్న టీవీ స్పెసిఫికేషన్లను, ఫీచర్లను టీజర్ ద్వారా వెల్లడించింది. ఈ టీవీని మే 25వ తేదీన లాంచ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించింది. రియల్ మీ నుంచి రానున్న మొదటి టీవీ ఇదే కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ టీవీ మొట్టమొదట మనదేశంలోనే లాంచ్ అవుతోంది.
ఈ టీవిలో 64 బిట్ మీడియాటెక్ ప్రాసెసర్ ను అమర్చారు. కార్టెక్స్ ఏ53 సీపీయూ, మాలి-470 జీపీ3 జీపీయూలు కూడా ఈ ప్రాసెసర్ లో ఉండనున్నాయి. ఇందులో నాలుగు స్పీకర్ల సిస్టంను అందించనున్నారు. దీని అవుట్ పుట్ 24Wగా ఉండనుంది. డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా ఉంది. రియల్ మీ టీవీలో వాయిస్ కమాండ్ కు సంబంధించిన ఫీచర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ టీవీ స్క్రీన్ సైజ్, ధర మొదలగు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Get ready to experience #RealPicture #RealSound, and deep-dive into the world of imagination with #realmeSmartTV!
Launching at 12:30 PM, 25th May on all our official channels.
Know more: https://t.co/LDwcrpVOrB pic.twitter.com/LtatPJEv99— realme Link (@realmeLink) May 18, 2020