మిస్టర్ బీన్‌తో రియల్‌మీ పరువు తీస్తున్న షావోమీ.. - MicTv.in - Telugu News
mictv telugu

మిస్టర్ బీన్‌తో రియల్‌మీ పరువు తీస్తున్న షావోమీ..

January 21, 2020

Xiaomi.

భారత మార్కెట్లో సంచలనం సృష్టించిన షావోమీ, రియల్‌మీ స్మార్ట్ ఫోన్ కంపెనీల మధ్య ఆధిపత్య పోరు కొత్త చర్యకు దారి తీసింది. రెండు కంపెనీలూ ఒకదానితో ఒకటి పోటీ పడుతూ మార్కెట్లో తమ సత్తాను చాటుకుంటున్నాయి. అయితే తమ స్మార్ట్ ఫోన్ ఫీచర్లనే రియల్ మీ కాపీ కొడుతోందంటూ షావోమీ ‘కాపీ క్యాట్’ పేరుతో ఓ ఫన్నీ వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తోంది. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆసక్తిగా చూస్తున్నారు. 

సోషల్ మీడియా వేదికగా రియల్‌మీ పరువు తీస్తోంది షావోమీ సంస్థ. షావోమీ ఆన్‌లైన్ పార్ట్‌నర్ సేల్స్ హెడ్, పోకో ఇండియా జీఎం ట్విట్టర్‌లో ఓ ఫన్నీ వీడియోను పోస్ట్ చేశారు. దాంట్లో తమ ప్రొడక్ట్‌ను ఏ విధంగా కాపీ కొడుతున్నారో వివరిస్తున్న  ఈ వీడియో ద్వారా చెప్పుకొచ్చారు. అయితే చాలా రోజులుగా రియల్‌మీ తమను కాపీ చేస్తోందంటూ షావోమీ ఆరోపిస్తూనే ఉంది. అయినప్పటికీ రియల్ మీ బ్రాండ్లకు కూడా మంచి ఆధరణ లభించింది. తాజాగా ఆ సంస్థతో పోటీని తట్టుకునేందుకు ఈ సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఇంతలా ట్రోల్ చేస్తూ.. పోస్ట్ చేసిన వీడియోపై రియల్‌మీ ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.