భారత్ మార్కెట్లోకి.. రియల్‌మీ ఎక్స్2 ప్రో - MicTv.in - Telugu News
mictv telugu

భారత్ మార్కెట్లోకి.. రియల్‌మీ ఎక్స్2 ప్రో

November 20, 2019

Realme X2 Pro, Realme 5s India launch today Expected specs and price, how to watch livestream

వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు రియల్‌మీ మరిన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో ఒక ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌‌ను బుధవారం లాంచ్‌ చేసింది. ‘రియల్‌మీ ఎక్స్2 ప్రొ‘ పేరుతో తీసుకువచ్చిన ఈ ఫోన్ ఇప్పటికే చైనాలో అందుబాటులో ఉంది. దీనిని ఇపుడు భారత మార్కెట్లలో కూడా తీసుకొచ్చింది. రియల్‌మీ ఎక్స్2 ప్రోలో  రెండు వేరియంట్లు అందుబాటులో ఉండనున్నాయి. దీంతోపాటు రియల్‌ ఎక్స్‌ 2  ప్రొ మాస్టర్‌ ఎడిషన్‌ను కూడా రియల్ మీ లాంచ్‌ చేసింది. ఈ నెల 26నుంచి ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మీ ఆన్‌లైన్‌ స్టోర్ల ద్వారా అందుబాటులోకి రానున్నాయి. రియల్ మీ ఎక్స్2 ప్రొ మాస్టర్ ఎడిషన్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ గల ఒక్క వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. ఇది క్రిస్మస్‌నాటికి అందుబాటులోకి  వస్తుందని రియల్ మీ తెలిపింది. 

ప్రారంభ వేరియంట్ 8 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999
హై ఎండ్ వేరియంట్ 12 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,999 
మాస్టర్‌ ఎడిషన్​ 12 జీబీ ర్యామ్, 256 జీబీ వేరియంట్ ధర రూ.34,999లకు లభిస్తున్నాయి.  దీంతో పాటు ‘రియల్‌మీ ఎస్‌’ పేరుతో మరో స్మార్ట్‌ఫోన్‌ను కూడా కంపెనీ లాంచ్‌ చేసింది. 48 ఎంపీ ప్రైమరీ క్వాడ్‌ రియర్‌ కెమెరా సెటప్‌తో  రెండు వేరియంట్లలో లాంచ్‌ చేసింది.  రూ. 9999, రూ 10,999 ధరలతో ఈ నెల 29 నుంచి విక్రయానికి లభ్యం కానుంది.

రియల్‌ మి ఎక్స్‌ 2 ప్రొ ఫీచర్లు ఇలా.. 

4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ 
6.50 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే

16 మెగా పిక్సల్ ఫ్రంట్‌ కెమెరా
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855+ప్రాసెసర్
ఆండ్రాయిడ్‌ 9పై 
1080×2400 పిక్సల్స్‌ రిజల్యూషన్‌
8జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజీ
64+13 +8+ 2 ఎంపీ క్వాడ్‌ రియర్‌ కెమెరా