రియల్‌మి నుంచి రెండు కొత్త ఫోన్లు - MicTv.in - Telugu News
mictv telugu

రియల్‌మి నుంచి రెండు కొత్త ఫోన్లు

June 25, 2020

ప్రముఖ చైనీయ మొబైల్ తయారీదారు సంస్థ రియల్‌మి ఎక్స్ సిరీస్ లో భాగంగా కొత్త రెండు స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్ లో లాంచ్ చేసింది. రియల్‌మి ఎక్స్‌ 3, రియల్‌మి ఎక్స్‌ 3 సూపర్‌జూమ్‌ పేరుతో వీటిని విడుదల చేసింది. రియల్‌మి ఎక్స్‌ 3 రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. వీటి ధరల విషయానికి వస్తే.. 6జీబీ ర్యామ్/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ. 24,999గా నిర్ణయించింది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ. 25,999 రూపాయలుగా నిర్దేశించింది. అలాగే రియల్‌మి ఎక్స్3 సూపర్ జూమ్ కూడా రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ. 27,999గా నిర్ణయించగా.. 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ. 32,999గా నిర్ణయించింది. ఈ ఫోన్ అమ్మకాలు ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి వెబ్‌సైట్లలో జూన్ 30 నుంచి జరుగనున్నాయి. జూన్ 27వ తేదీ నుంచి ప్రీ-బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ ఫోన్ ను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్ లభించనుంది.

 

రియల్‌మి ఎక్స్‌ 3 ఫీచర్లు

* 6.60 అంగుళాల డిస్ ప్లే,

* క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855+ ప్రాసెసర్,

* 16+8 మెగాపిక్సెల్ డ్యూయల్ సెల్పీ కెమెరా,

* 64+8+12+2 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్,

* ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం,

* 4200 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

రియల్‌మి ఎక్స్ 3 సూపర్ జూమ్ ఫీచర్లు

* 6.60 అంగుళాల డిస్ ప్లే,

* క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855+ప్రాసెసర్,

* 32+8 మెగాపిక్సెల్ డ్యూయల్ సెల్ఫీ కెమెరా,

* 64+8+8+2 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్,

* ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం,

* 4200 ఎంఏహెచ్ బ్యాటరీ.