‘రియల్‌మీ’  4 కెమెరాల ఫోన్ వచ్చేసింది - MicTv.in - Telugu News
mictv telugu

‘రియల్‌మీ’  4 కెమెరాల ఫోన్ వచ్చేసింది

September 13, 2019

రియల్‌మీ స్మార్ట్ ఫోన్ ప్రియులకు శుభవార్త. ఆ కంపెనీ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. రియల్‌మీ ఎక్స్‌టీ స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల ఆ కంపెనీ విడుదల చేసింది. ప్రపంచంలోనే తొలి 64 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ ఇదే కావడం విశేషం. ఈ ఫోన్‌కు నాలుగు కెమెరాలు ఉండగా అందులో ఒక కెమెరాకు 64 మెగాపిక్సెల్ లెన్స్ అమర్చారు. రియల్‌మీ ఎక్స్‌టీ అమ్మకాలు సెప్టెంబర్ 16న ఫ్లిప్‌‌కార్ట్‌లో ప్రారంభం కానున్నాయి. ఈ ఫోన్ పెరల్ వైట్, పెరల్ బ్లూ రంగుల్లో లభించనుంది. అలాగే మూడు మెమరీ వేరియంట్లలో లభించనుంది. మూడు మెమరీ వేరియంట్ల ధరలు ఈ విధంగా ఉన్నాయి.. 4 జీబీ + 64 జీబీ ధర రూ.15,999, 6 జీబీ + 64 జీబీ ధర రూ.16,999, 8 జీబీ + 128 జీబీ ధర రూ.18,999 గా నిర్ణయించారు.

Realme XT Price in India Starts at Rs. 15,999, price, specifications

రియల్‌మీ ఎక్స్‌టీ ఫీచర్లు

* 6.4 ఇంచెస్ సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే,

* 8జీబీ ర్యామ్,

* 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్,

* స్నాప్‌డ్రాగన్ 712 ప్రాసెసర్,

* 64+8+2+2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా,

* 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా,

* 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ,

* ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్,

* డ్యూయెల్ సిమ్.