కారు ప్రమాదానికి కారణాలు ఇవే.. సంచలన నిజాలు..! - MicTv.in - Telugu News
mictv telugu

కారు ప్రమాదానికి కారణాలు ఇవే.. సంచలన నిజాలు..!

November 24, 2019

గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై జరిగిన జరిగిన కారు ప్రమాదం అందరిని భయభ్రాంతులకు గురి చేసింది. వేగంగా పై నుంచి ఎగిరిపడటం చూసి ప్రజలు భయపడిపోతున్నారు. ఎప్పుడు ప్రమాదం ఏ రూపంలో వస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ ఈ ప్రమాదానికి కారణాలేంటీ..? అనే అంతా చర్చించుకుంటున్నారు. ఈ సమయంలోనే పోలీసుల విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 

Gachibowli.

కల్వకుంట్ల కృష్ణ మిలాన్‌రావు మైండ్ స్పేస్ వెళ్లేందుకు అతివేగంగా ప్లైఓవర్ పై నుంచి వస్తున్నాడు. ఆ సమయంలో మూలమలుపు వద్ద కారు అదుపుతప్పి అంతే వేగంతో కిందపడిపోయింది. ఈ సమయంలో కారు 104 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్టుగా పోలీసులు వెల్లడించారు. ప్రత్యక్ష సాక్షులు కూడా కారు వేగంగా వెళ్లినట్టు చెబుతున్నారు. ఈ సమయంలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రమాదానికి గురైన TS 09EW5665‌  కారుపై గతంలో కూాడా ఫైన్ విధించారు, ఓవర్ స్పీడ్‌తో వెళ్లినందుకు ఆ కారుపై డైవర్సిటీ ఫ్లైఓవర్ లెవెల్ 2 వద్ద రూ.1000 ఈ చలాన్ వేశారు. మరోసారి వేగంగా వచ్చిన ఆ కారు ఇలా ప్రమాదనికి గురైంది.