reason behind nagarjuna absence to super star krishna funeral
mictv telugu

కృష్ణ అంత్యక్రియలకు నాగార్జున మిస్..!

November 17, 2022

సూపర్ స్టార్ కృష్ణని కడసారి చూసేందుకు సినీ రాజకీయ లోకమంతా తరలి వచ్చింది. కేసీఆర్, జగన్, చంద్రబాబు, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి అతిరథ మహారధులు అందరు సూపర్ స్టార్ పార్థివదేహాన్ని చివరిసారి చూసి వెళ్లినా.. ఇండస్ట్రీ నుండి అక్కినేని నాగార్జున రాకపోవటం చర్చనీయాశం అవుతుంది. బిగ్ బాస్, బిజినెస్, సినిమాలు వంటి అంశాల్లో నాగార్జున ఎంత బిజీగా ఉన్నా కృష్ణని కడసారి చూసేందుకు కూడా సమయం లేదా అని కొందరు సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. అయితే కృష్ణ అంత్యక్రియలకు నాగార్జున రాకపోవడానికి ముఖ్యకారణం ఆయన హైదరాబాద్ లో లేకపోవటమే అంటున్నారు.

ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారట నాగార్జున. ముందుగా ఏర్పరుచుకున్న ప్రణాళికల ప్రకారం అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్లిన నాగార్జున శనివారం బిగ్ బాస్ కోసం హైదరాబాద్ కి రానున్నారట. అందుకే దయచేసి ఎవరు నాగార్జున గైరుహాజరుని తప్పుగా అనుకోవద్దంటూ అక్కినేని వర్గాలు చెప్తున్నాయి. కృష్ణ, మహేష్ బాబు అంటే నాగార్జునకి చాలా అభిమానం అని, మహేష్ బాబు తల్లి చనిపోయినప్పుడు కూడా నాగార్జున వచ్చారని, ఇక నాగచైతన్య, అఖిల్ లు కృష్ణ దెగ్గరికి వెళ్లారని గుర్తుచేస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్. అయితే హైదరాబద్ రాగానే బిగ్ బాస్ వేదిక నుండి నాగార్జున ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. తాను ఎందుకు రాలేదన్నది నాగార్జుననే స్వయంగా చెప్పి మహేష్ బాబుని కలుస్తారని అక్కినేని వర్గం నుండి అందుతున్న సమాచారం.