45 ఏళ్లు దాటినా ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే.. సుబ్బరాజు - MicTv.in - Telugu News
mictv telugu

45 ఏళ్లు దాటినా ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే.. సుబ్బరాజు

May 26, 2022

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా మంచి డిమాండ్ ఉంది. అందులోనూ పాత్రకు తగ్గట్టుగా నటించే సత్తా ఉన్న నటులకు మరింత మార్కెట్ ఉంది. అలాంటి వారిలో సుబ్బరాజు పేరు ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. ‘ఖడ్గం’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన సుబ్బరాజు కు… ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక అంతే… ఆర్య, భద్ర, పోకిరి, పౌర్ణమి, దేశముదురు వంటి వరుస సినిమాలతో మనోడి రేంజ్ మారిపోయింది. పరుగు, బుజ్జిగాడు, నేనింతే, లీడర్, బాహుబలి 2, గీత గోవిందం, సర్కారు వారి పాట వంటి చిత్రాలతో ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించాడు.

పశ్చిమ గోదావరి జిల్లా కి చెందిన సుబ్బరాజుకు ప్రస్తుత వయస్సు 45 సంవత్సరాలు . స్టిల్ బ్యాచిలర్. ఇంతవరకూ పెళ్లి ఎందుకు చేసుకోలేదనే అనే ప్రశ్నకు గతంలో ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఓ ఆసక్తికరమైన సమాధానమిచ్చాడు. ‘అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలో అర్థం కాలేదు. ఏపనైనా చేయాలంటే రీజన్ ఉంటుంది. చేయకపోవడానికి రీజన్ ఉండదు కదా. పెళ్లి పెద్దల కోసం చేసుకోవడం సరికాదు. ఇప్పటి వరకు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడలేదు. పెళ్లి చేసుకోవడం వేరు.. జరగడం వేరు. పెళ్లి జరగడం అనేది పెద్దల బలవంతం మీద ఆధారపడి ఉంటుంది.పెద్దల సంతోషం కోసం పెళ్లి చేసుకుని తర్వాత ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు. నాకు పెళ్ళి చేసుకోవాలి అనిపించినప్పుడు పెళ్లి చేసుకుంటా .. అని చెప్పాడు.