Reasons why India lost the 2nd T20 match against Sri Lanka
mictv telugu

7 నోబాల్స్..34 పరుగులు…భారత్ ఓటమికి కారణమిదే !

January 6, 2023

శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత్‌ ఓడింది. చివరి వరకు ఉత్కంఠ బరితంగా సాగిన మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. శ్రీలంక నిర్దేశించిన 207 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఆటగాళ్లు ఆందుకోలేకపోయారు. 20 ఓవర్లలో 8 వికెట్లకు 190 పరుగులు మాత్రమే చేసి విజయం ముంగిట నిలిచిపోయారు. అక్షర్ పటేల్(31 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 65), సూర్యకుమార్ యాదవ్(36 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 51) రాణించినా మిగిలిన బ్యాటర్లు పెవిలియన్‎కు క్యూ కట్టడంతో టీం ఇండియాకు ఓటమి తప్పలేదు.

57 పరుగులకే 5 వికెట్లు

207 పరుగుల భారీ లక్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగలింది. రెండో ఓవర్ మొదటి, చివరి బంతులకు ఓపెనర్లు ఔటయ్యారు. తర్వాత రాహుల్ త్రిఫాఠి, హార్దిక్, దీపక్ హుడాలు పోటీపడి పెవిలియన్‎కు చేరడంతో భారత్ 57 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాలో కూరుకుపోయింది. ఈ దశలో సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల జట్టును ఆదుకున్నారు. ఇద్దరు
అర్థసెంచరీలు సాధించి జట్టును విజయం వైపు నడిపించారు. ఆరో వికెట్‌కు 42 బంతుల్లో 91 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. చివరిలో సూర్యకుమార్ ఔటవ్వడం, అప్పటికే సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోవడంతో భారత్‎కు ఓటమి తప్పలేదు. లాస్ట్‌లో శివమ్ మావి(15 బంతుల్లో 26 పరుగులు) బ్యాట్ ఝులిపించినా ఫలితం లేకుండా పోయింది. 12 బంతుల్లో 33 పరుగులు చేయాల్సి సమయంలో. రజితా వేసిన 19వ ఓవర్‌లో రెండు వైడ్లతో 12 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో ఆఖరి ఓవర్‌లో 21 పరుగులు అవసరమయ్యాయి. తొలి రెండు బంతులకు మూడు పరుగులే రాగా. మూడో బంతికి అక్షర్ పటేల్ ఔట్ అవ్వడంతో మ్యాచ్‎ను శ్రీలంక గెలిచేసింది.

అదరగొట్టిన అక్షర్

ఈ మ్యాచ్‌లో తన శైలికి భిన్నంగా సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ కొనసాగింది. వరుస వికెట్లు పడుతుండడంతో క్రీజ్‌లో నిలదొక్కుకుని ఇన్నింగ్స్‎ను కొనసాగించాడు. చివరిలో తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ గేరు మార్చాడు. అక్షర్ పటేల్ మాత్రం జోరు కొనసాగించాడు. వరుసు సిక్సర్లతో శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. హసరంగా వేసిన 14వ ఓవర్‌లో అక్షర్ వరుసగా మూడు సిక్ష్‌లు బాదడం విశేషం. ఈ క్రమంలోనే 20 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. సూర్య సైతం మదుషంక బౌలింగ్‌లో సిక్స్ బాది 33 బంతుల్లో అర్థసెంచరీ సాధించాడు.

శ్రీలంక సూపర్ బ్యాటింగ్

ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగులు చేసింది. ఓపెనర్లు కుశాల్ మెండీస్(52), పాతుమ్ నిస్సంక(33) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. చివరిలో
కెప్టెన్ డసన్ షనక(22 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 56 నాటౌట్) రెచ్చిపోవడంతొ శ్రీలంక భారీ స్కోర్ సాధించింది. అంతకుముదుభారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్(3/48) మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్(2/24) రెండు వికెట్లు పడగొట్టాడు. యుజ్వేంద్ర చాహల్ ఓ వికెట్ తీసాడు.

కొంపముంచిన నో బాల్స్..

రెండు టీ20లో భారత్ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. పేలవ బౌలింగ్‌తో భారీగా పరగులిచ్చారు. ప్రధానంగా అర్షదీప్ సింగ్ తేలిపోయాడు. 2 ఓవర్లు వేసి ఏకంగా 37 పరుగులు సమర్పించుకున్నాడు. గత మ్యాచ్‌లో రాణించినా శివమ్ మావి 4 ఓవర్లలో 53 పరుగులు, ఉమ్రాన్ మాలిక్ 4 ఓవర్లలో మూడు వికెట్లు తీసి 48 పరుగులు ఇచ్చారు. బ్యాటింగ్ లో రాణించాన అక్షర్ పటేల్ బౌలింగ్ లో శభాష్ అనిపించుకున్నాడు 4 ఓవర్లు వేసి 24 పరుగుల ఇచ్చి రెండు కీలక వికెట్లను తీశాడు. మ్యాచ్‌లో భారత్ బౌలర్లు వేసిన నో బాల్స్ కొంపముంచాయి. 7 నోబాల్స్ వేసిన బౌలర్లు వీటిద్వారా అదనంగా 34 పరుగులు సమర్పించుకున్నారు. ఇందులో అర్ష్‌దీప్ సింగ్ ఒక్కడే 5 నోబాల్స్ వేసాడు.