Rebel Star Krishnam Raju Death Prabhas Tears Video Viral
mictv telugu

బరువెక్కిన గుండెతో కన్నీళ్లు పెట్టుకున్న ప్రభాస్.. వీడియో

September 11, 2022

రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతితో ఒక్కసారిగా చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక పెద్దనాన్న మృతితో ప్రభాస్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. రెబల్ స్టార్ నట వారసుడిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ప్రభాస్ ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ యంగ్ రెబల్ సార్ గా, పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. కృష్ణంరాజు లేకపోయి ఉంటే ఈ ప్రభాస్ లేడని ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు డార్లింగ్.

 

ఇక తనకున్న పెద్ద దిక్కు ఇకనుంచి ఉండరని తెలియడంతో ఒక్కసారిగా ప్రభాస్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఆయన ఏడుపును ఆపడం ఎవరి వల్ల కావడంలేదు. ఎంతమంది వచ్చి ఆయనను ఓదార్చాలని చూస్తున్నా ప్రభాస్ కంటి నుంచి కన్నీటి ధార ఆగడం లేదు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ విజువల్స్ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు చాలామంది కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు.