Rebel star Krishnam Raju final journey and Last rites concluded in Moinabad
mictv telugu

ముగిసిన కృష్ణంరాజు అంత్యక్రియలు.. దివికేగిన రారాజు

September 12, 2022

దిగ్గజ న‌టుడు, మాజీ ఎంపీ కృష్ణంరాజు అంత్య‌క్రియ‌లు పూర్తయ్యాయి. ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో కుటుంబ స‌భ్యులు, అభిమానుల మ‌ధ్య ఆయ‌న అంత్య‌క్రియ‌లు ఇవ్వాల రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండ‌లం క‌న‌క‌మామిడిలో ఉన్న ఫామ్ హౌజ్‌లో పూర్తిచేశారు. హీరో ప్ర‌భాస్ సోద‌రుడు ప్ర‌భోద్, కృష్ణంరాజు పార్థివదేహానికి త‌ల‌కొరివి పెట్టాడు. క‌డ‌సారీ వీడ్కోలు ప‌లికేందుకు రెబ‌ల్‌స్టార్ అభిమానులు క‌న‌క‌మామిడి ఫాంహౌజ్‌కు త‌రలివ‌చ్చారు.

పెద్ద సంఖ్య‌లో సినీప్ర‌ముఖులు, రాజ‌కీయ‌నాయ‌కులు అంతిమ సంస్కారాల‌కు హాజ‌రయ్యారు. కృష్ణంరాజు ఆకస్మిక‌ మ‌ర‌ణంతో సినీ ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర విషాదం నెల‌కొంది. కోంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న కృష్ణంరాజు ఆదివారం తెల్ల‌వారు జామున తుది శ్వాస విడిచారు. ఈయ‌న మ‌ర‌ణంపై ప‌లువురు సినీప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టించారు. అంతిమ యాత్ర‌కు ముందు జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఆయ‌న భౌతిక కాయానికి సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు నివాళులు అర్పించారు.