Reckless man peeing on the roadside given shock of his life by passing lorry
mictv telugu

రోడ్డుపై పోశాడు.. తిరిగి ముఖంపైనే పడింది… వీడియో

June 30, 2022

చర్యకు ప్రతిచర్య కచ్చితంగా ఉంటుంది. ఇదే కర్మ సిద్ధాంతం. ఇప్పుడు ఈ వేదాంతం ఎందుకంటే … ఒళ్లు కొవ్వెక్కిన ఓ తుంటరి చేసిన పని.. చివరకు అతడిని నవ్వులపాలు చేసింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. వివరాల్లోకి వెళ్తే.. ఆ రోడ్డుపై అప్పుడే వర్షం పడి ఆగడంతో రోడ్డుపై ఉన్న చిన్న చిన్న గుంతల్లో నీళ్లు నిలిచి ఉన్నాయి. ఇంతలో ఓ యువకుడు రోడ్డు మీద కనిపించిన నీటి గుంతలో.. ప్యాంట్ జిప్ తీసి పిస్ కొట్టడం ప్రారంభించాడు. అదే సమయంలో రోడ్డు మీద వాహనాలు వెళ్తున్నా అతగాడు లెక్కచేయలేదు. కానీ ఇంతలో ఓ లారీ వేగంగా దూసుకొచ్చింది. ఆ లారీ చక్రాలు గుంతలో పడటంతో అందులో ఆ యువకుడు పోసిన యూరిన్ జల్లు అతడి ముఖంపైనే పడ్డాయి. ఈ వ్యవహారం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది. దీంతో ఈ వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. మొత్తానికి యువకుడికి తగిన శాస్తే జరిగిందని మెజారిటీ నెటిజన్‌లు కామెంట్ చేయడం గమనార్హం.