అమ్మాయిగా 21 ఏళ్లు.. ఇప్పుడు చూస్తే ఊహించని మలుపు - MicTv.in - Telugu News
mictv telugu

అమ్మాయిగా 21 ఏళ్లు.. ఇప్పుడు చూస్తే ఊహించని మలుపు

May 24, 2022

సౌదీ అరేబియాకు చెందిన 21 ఏళ్ల యువతి ఇప్పటివరకు అమ్మాయిగా బతికింది. కానీ, అమ్మాయి లక్షణాలు లేకపోవడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా షాకింగ్ విషయం బయటపడింది. అమ్మాయి కాదు అబ్బాయని వైద్యులు నిర్ధారించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. పూర్తి వివరాలిలా ఉన్నాయి. రాండా షబెలి అనే అమ్మాయి రియాద్‌లోని ప్రభుత్వాసుపత్రిలో 21 ఏళ్ల క్రితం జన్మించింది. పుట్టినప్పుడు జననాంగాలను చూసి లింగనిర్ధారణ చేస్తారు కదా.

అలా ఆ అమ్మాయి జననాంగాలు చూసి అమ్మాయి పుట్టిందని వైద్యులు ప్రకటించేశారు. కాల క్రమేణా రాండా పెరిగి పెద్దదవుతుండగా, శరీరంలో యువతి లక్షణాలు లేకపోవడంతో వైద్యుల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించారు. పరిశీలించిన వైద్యులు రాండా అమ్మాయి కాదని, అబ్బాయి అని తేల్చి చెప్పేశారు. రాండా పొత్తి కడుపులో పురుష జననాంగాలు ఉన్నాయని తెలిపారు. దీంతో రాండాతో పాటు తల్లిదండ్రులు, బంధువులు ఆశ్చర్యపోయారు. ఇన్నాళ్లు అమ్మాయి అనుకున్న రాండాను ఇప్పుడు అబ్బాయిగా భావించడాన్ని ఊహించుకోలేకపోతున్నారు. ఈ విషయం తెలిసి అక్కడి మీడియా ఆమెను తరచూ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.