Record electricity consumption in Telangana today
mictv telugu

తెలంగాణలో ఇవ్వాళ రికార్డు స్థాయి విద్యుత్ వినియోగం

February 10, 2023

Record electricity consumption in Telangana today

రాష్ట్ర చరిత్రలోనే శుక్రవారం సాయంత్రం 4 గంటలకు రికార్డు స్థాయి విద్యుత్ వినియోగం జరిగిందని ఆ శాఖ అధికారులు వెల్లడించారు. గతేడాది ఇదే రోజు 11 వేల 876 మెగావాట్లు కాగా, ఈ రోజు 14 వేల 169 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. ఇప్పటివరకు ఈ రికార్డు గతేడాది మార్చిలో నమోదైంది. అప్పుడు 14 వేల 160 మెగావాట్ల కరెంటు వాడుకున్నారు. అయితే ఈ సారి ఈ రికార్డు ఫిబ్రవరిలోనే నమోదవ్వడం గమనార్హం. ఇక రాబోయే వేసవిలో ఈ రికార్డు కూడా బద్ధలవుతుందని అంచనా వేస్తున్నారు. విద్యుత్ సిబ్బంది కూడా అందుకనుగుణంగా సిద్ధంగా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాదుతో పాటు యాసంగి పంటకు రైతులు మోటార్ల ద్వారా నీరు అందిస్తుండడంతో డిమాండ్ ఎక్కువైంది.