Record revenue for Srivari Hundi thirumala
mictv telugu

శ్రీవారి హుండీకి రికార్డు స్థాయి ఆదాయం.. వృద్ధులకు అరగంటలో దర్శనం

September 10, 2022

తిరుమల శ్రీవారి హుండీకి ఆగస్టు నెలలో చరిత్రలో తొలిసారి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. ఈ నెలలో శ్రీవారిని 22.22 లక్షల మంది భక్తులు దర్శించుకోగా, రూ. 140.34 కోట్ల ఆదాయం వచ్చింది. 1.05 కోట్ల లడ్డూ విక్రయాలు, 10.85 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 47.46 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించారు. కాగా, మే నెలలో రూ. 130.50 కోట్లు, జులైలో రూ. 139.45 కోట్లు హుండీ ద్వారా వచ్చాయి. అటు 65 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్స్‌కి టీటీడీ శుభవార్త చెప్పింది. ఉచిత శీఘ్ర దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. తగిన ఆధారాలతో వివరాలు సమర్పిస్తే కేవలం 30 నిమిషాల్లోనే దర్శనం కల్పించనుంది. ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు మరోసారి ఈ అవకాశం కల్పిస్తున్నట్టు వెల్లడించింది. ఆ సమయంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా, మిగతా దర్శన క్యూలను నిలిపివేసి కేవలం సీనియర్ సిటిజన్స్‌ లైనుని మాత్రమే అనుమతిస్తారు. వీరు కేవలం రూ. 20 చెల్లిస్తే రెండు లడ్డూలను ప్రసాదంగా ఇవ్వనుంది. అయితే ఈ అవకాశం 90 రోజులకు ఒకసారి మాత్రమే ఉండనుంది. మరిన్ని వివరాలకు తిరుమల హెల్ప్ డెస్క్ 08772277777 నెంబరును సంప్రదించాలని సూచించింది.