సింగరేణి, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ల రికార్టుల మోత - MicTv.in - Telugu News
mictv telugu

సింగరేణి, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ల రికార్టుల మోత

April 1, 2022

 

gnfgnfgngnf

తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లు రికార్డులు సృష్టించాయి. చరిత్రలోనే అత్యధికంగా ఆయా సంస్థల ఉత్పత్తులు కోట్ల టర్నోవర్‌ను సాధించాయని సీఎండీలు తెలిపారు. తెలంగాణలో 650 లక్షల టన్నుల బొగ్గును సింగరేణి ఉత్పత్తి చేసిందని, రికార్డు స్థాయిలో రూ.26 వేల కోట్ల టర్నోవర్‌ సాధించిదని సీఎండీ శ్రీధర్‌ శుక్రవారం తెలిపారు. గతేడాదితో పోల్చితే, ఈ ఏడాది బొగ్గు ఉత్పత్తిలో 28.6 శాతం వృద్ధి సాధించామన్నారు. బొగ్గు రవాణాలో 35.1 శాతం వృద్ధి, ఓవర్‌ బర్డెన్‌ తొలగింపులో 20.1 శాతం వృద్ధిని సాధించామన్నారు.

మరోపక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ గత రికార్డులను తిరగరాసింది. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో అత్యధికంగా రూ.28,008 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. గతేడాదితో పోలిస్తే, ఈ ఏడాది 56 శాతం అధికమయిందని స్టీల్ ప్లాంట్ ఛైర్మన్, ఎండీ అతుల్ భట్ పేర్కొన్నారు. అయితే, 2021-22 ఆర్ధిక సంవత్సరంలో మొత్తం 5,773 మిలియన్ టన్నుల హాట్ మెటల్, 5.2772 మిలియన్ టన్నుల క్రూడ్ స్టీల్, 5, 188 మిలియన్ టన్నుల సేలెబుల్ స్టీల్‌ను ఉత్పత్తి చేసినట్లు స్టీల్ ప్లాంట్ ఓ ప్రకటనలో తెలిపింది. మొత్తం రూ. 5,007 కోట్ల మేర ఎగుమతులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.