బ్యాంకు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి…బ్యాంక్ ఎస్ఓ రిక్రూట్ మెంట్ కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ఇండియన్ బ్యాంక్. భారత ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన ఇండియన్ బ్యాంక్, స్పెషలిస్టు ఆఫీసర్స్ గా పలు పోస్టులకు రిక్రూట్ చేయబోతోంది. ఈ పోస్టుల్లో పలు విభాగాల్లో చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ తదితర పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ indianbank.inను చెక్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 16,2023 నుంచి ప్రారంభం అవుతుంది. 28, ఫిబ్రవరి 2023 చివరి తేదీ.
అర్హత
ఇండియన్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం, దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఖాళీలకు సంబంధించిన సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ లేదా పీజీ లేదా సీఏ లేదా బీటెక్ మొదలైనవాటిలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే చాలా పోస్టులకు సంబంధిత విభాగంలో 3 లేదా 5 లేదా 7 అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయస్సు కనిష్టంగా25, గరిష్టంగా 35 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. ఇక్కడ వయస్సు 1 జనవరి 2023 నుండి లెక్కించబడుతుంది. అయితే, రిజర్వ్‌డ్ వర్గాలకు చెందిన అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది. మరిన్ని వివరాల కోసం రిక్రూట్‌మెంట్ ప్రకటనను చెక్ చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ
వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కోసం అభ్యర్థులు రాత/ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. మొదటి దశలో, ప్రొఫెషనల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ,జనరల్ అవేర్‌నెస్‌కు సంబంధించిన 100 ప్రశ్నల రాత పరీక్ష ఉంటుంది. పరీక్ష వ్యవధి 2 గంటలు, నెగెటివ్ మార్కింగ్ 1/4 ఉంటుంది.