బ్యాంకింగ్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. సెంట్రల్ బ్యాంక్ ఆప్ ఇండియాలో పలు పోస్టుల కోసం ఖాళీలను వెల్లడించింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అర్హతలు ఉంటే ఈ ప్రభుత్వ ఉద్యోగం పొందేందుకు మీకు మంచి అవకాశం ఇదే. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ మార్చి 15. అర్హతలు ఉన్న అభ్యర్థులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్ సైట్లో ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోమని కోరుతోంది. ఈ రిక్రూట్ మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
అర్హతలు:
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 28 నుంచే మొదలైంది. మార్చి 15న ముగుస్తుంది. పరీక్ష మార్చి లేదా ఏప్రిల్లో నిర్వహించే చాన్స్ ఉంది. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ సంస్థలోని 147 పోస్టులను భర్తీ చేసున్నట్లు పేర్కొంది. అర్హతలు, ఎంపిక ప్రక్రియ, ఇతర వివరాలు, విద్యా అర్హత గురించి తెలుసుకుందాం.
ఎంపిక ప్రక్రియ మొత్తం ఆన్ లైన్లో లేదా బ్యాంక్ నిర్ణయించిన ప్రమాణాల ఆధారంగా ఉంటుంది. షార్ట్ లిస్టు చేయబడిన అభ్యర్థులను తర్వాత ఇంటర్వ్యూకి ప్రమోట్ చేస్తారు. అభ్యర్థులందరూ రూ. 1000చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ లకు రుసుము మినహాయించారు.
మరింత సమాచారం కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలు 2023 నోటిఫికేషన్ పైb క్లిక్ చేయండి