అటామిక్ ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌లో పని చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్. అటామిక్ ఎనర్జీ డిపార్ట్‌మెంట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ చీఫ్ ఫైర్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్, డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్, ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది, దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ ఏప్రిల్ 10. ఈ రిక్రూట్‌మెంట్‌లో ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.nfc.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు:
చీఫ్ ఫైర్ ఆఫీసర్/ఏ: 01 పోస్ట్.
టెక్నికల్ ఆఫీసర్/సి(కంప్యూటర్): 03 పోస్టులు.
డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్/ఎ: 02 పోస్టులు.
స్టేషన్ ఆఫీసర్/ఏ: 07 పోస్టులు.
సబ్ ఆఫీసర్/ఏ: 28 పోస్టులు.
డ్రైవర్-కమ్-పంప్ ఆపరేటర్ కమ్-ఫైర్‌మెన్/ఏ (డీపీఓఎఫ్/ఏ): 83 పోస్టులు
వయస్సు:
టెక్నికల్ ఆఫీసర్/C డ్రైవర్-కమ్-పంప్ ఆపరేటర్ కమ్-ఫైర్‌మ్యాన్/ఏ (DPOF/A) పోస్టులకు మినహా అభ్యర్థి గరిష్ట వయస్సు 40ఏళ్లు ఉండాలి. టెక్నికల్ ఆఫీసర్/సి (కంప్యూటర్) పోస్టులకు గరిష్ట వయోపరిమితి 35 ఏళ్లు, డ్రైవర్-కమ్-పంప్ ఆపరేటర్ కమ్-ఫైర్‌మ్యాన్/ఏ (డీపీఓఎఫ్/ఏ) పోస్టులకు 27 ఏళ్లు మించకూడదు.
ఎలా దరఖాస్తు చేయాలి
-ముందుగా www.nfc.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
-ఆపై హోమ్‌పేజీలో రిక్రూట్‌మెంట్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
-ఆ తర్వాత, ఫైర్ సర్వీసెస్ పర్సనల్ & టెక్నికల్ ఆఫీసర్స్ (కంప్యూటర్స్) రిక్రూట్‌మెంట్ మీద క్లిక్ చేయండి.
-ఇప్పుడు దరఖాస్తు ఫారమ్ నింపండి.
-ఆ తర్వాత దరఖాస్తు రుసుము చెల్లించండి.
-ఫారమ్‌ను సమర్పించి, భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్‌అవుట్ తీసుకుని దగ్గర పెట్టుకోండి.