30 వేల జీతంలో పారామెడికల్ ఉద్యోగాలు.. రేపే నోటిఫికేషన్ - MicTv.in - Telugu News
mictv telugu

30 వేల జీతంలో పారామెడికల్ ఉద్యోగాలు.. రేపే నోటిఫికేషన్

November 30, 2022

తెలంగాణ ప్రభుత్వం గతంలో నిర్వహించిన కంటి వెలుగు పథకాన్ని మళ్లీ ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం అమలు కోసం మంగళవారమే ప్రభుత్వం రూ. 200 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇప్పుడు కీలకమైన పారామెడికల్ ఉద్యోగులను భర్తీ చేయడంపై దృష్టి సారించింది. రెండో విడత అమలుకై పారామెడికల్ ఆప్తమాలిక్ ఆఫీసర్ల భర్తీ కోసం వైద్యారోగ్య శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.

జిల్లా కలెక్టర్ల ద్వారా చేపట్టే ఈ నియామకాలకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు చేపట్టనున్నారు. డిసెంబర్ 1న నోటిఫికేషన్ జారీ చేసి 5న ఇంటర్వ్యూలు, 7న మెరిట్ జాబితా విడుదల చేస్తారు. 8 వరకు అభ్యంతరాలు స్వీకరించి 10 వరకు వాటిని పరిష్కరిస్తారు. అనంతరం ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల అవుతుంది. ఎంపికైన వారికి నెలకు జీతంగా రూ. 30 వేలు చెల్లిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా పథకం అమలు కోసం 1491 టీంలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా, రెండో విడత కంటి వెలుగు పథకం జనవరి 18 నుంచి ప్రారంభం కాబోతోంది.