ఎర్ర దొంగలు..గాయాలు.. ఓ చేజింగ్.. - MicTv.in - Telugu News
mictv telugu

ఎర్ర దొంగలు..గాయాలు.. ఓ చేజింగ్..

September 25, 2018

ఎర్రచందనం స్మగ్లర్లకు, పోలీసులక మధ్య సినిమాను తలపించే చేజింగ్ సీన్ చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. 80 మంది స్మగ్లర్లు, మారణాయుధాలు, వంటసామగ్రి తీసుకొని తమిళనాడు నుంచి పుత్తూరు వెళ్తున్న విషయం తెలుసుకున్న ఇన్‌ఫార్మర్.. పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వడమాలపేట టోల్ గేట్ వద్దకు చేరారు. అర్ధరాత్రి 12:50 గంటల తర్వాత తమిళనాడు రిజిస్ట్రేషన్ లారీ టోల్ ప్లాజా వద్ద ఆగకుండా దూసుకెళ్లింది. పోలీసులు స్మగ్లర్లు ఉన్న లారీని వెంబడించారు. వెంటనే తిరుపతి పోలీసులకు సమాచారం అందించారు. హైవే మొబైల్, పెట్రోలింగ్ పోలీసులు గాజులమండ్యం సర్కిల్ వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు.Red chill smugglers are caught in the cinematic style of the policeకానీ లారీలోని స్మగ్లర్లు మాత్రం వెనకడుగు వేయలేదు.. సినిమాలో మాదిరిగా బారికేడ్లను ఢీకొని తిరుచానూరు హైవే వైపు వెళ్లారు. దీంతో టాస్క్ ఫోర్స్, హైవే పెట్రోలింగ్ వాహనాలు లారీని ఫాలో అవుతూ వచ్చాయి.  తిరుచానూరు పోలీసులు తమ వాహనాలను రోడ్డుకు అడ్డం పెట్టారు. ఇది గమనించిన ఎర్ర చందనం స్మగ్లర్లకు దొరికిపోతామని భయం పట్టుకుంది. వెంటనే కొంతమంది లారీలోంచి కొంతమంది దూకిపారిపోయారు. డ్రైవర్ కూడా లారీని నడిరోడ్డుపై ఆపి పరారయ్యాడు.

పరారైన వారిలో ఏడుగురు దుండగులను పోలీసులు పట్టుకున్నారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. లారీ నుంచి దూకే సమయంలో వీరికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వీరిని అత్యవసర చికిత్స కోసం రుయా ఆస్పత్రికి తరలించారు. లారీ, గొడ్డళ్ళు, మద్యం సీసాలను పోలీసులు సీజ్ చేశారు. గతంలో కూడా ఇదే లారీలో ఎర్రచందనం అక్రమ రవాణా జరిగినట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఈ స్మగ్లింగ్ ఎవరూ? ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఎవరు పంపించారు? లారీ ఎవరిది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.