ఏపీలో ఎర్రచందనం నిల్వలు తరిగిపోతున్నాయి. ఖరీదైన ఈ ఎర్రబంగారాన్ని స్మగ్లర్లు భారీస్థాయిలో దేశం దాటిస్తున్నారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం మల్లెంకొండ అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు చెలరేగిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలో దాడులు చేసిన రూ. 3 కోట్ల విలువైన 138 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిని అరెస్ట్ చేశారు.ముందస్తు సమచారం అందడంతో అటవీ, పోలీసు శాఖల అధికారులు కలసి దాడులు చేశారు. వారిపై స్మగ్లర్లు ఎదురుదాడికిదిగారు. అయితే పోలీసులు తుపాకులు ఉండడంతో పైచేయి సాధించి అదుపులోకి తీసుకున్నారు., ఇన్నోవా, స్కార్పియో, మోటారుసైకిల్, 20సెల్ఫోన్లను కూడా పట్టుకున్నారు. నిందితులను తమిళనాడుకు చెందిన సయ్యద్ ఇబ్రహీంచ, రవేక్ కులాంతైరాజ్, తమీమ్ అన్సారీ, , ఇక్బాల్, నాగూర్ గనిగా గుర్తించారు. వీరు గతంలో నెల్లూరు, చిత్తూరు, కడపజిల్లాల్లో ఎర్రచందనాన్ని కొల్లగొట్టినట్లు కేసులు ఉన్నాయన్నారు.