మందుబాబులకు కన్నీళ్లు.. 50వేల లీటర్ల వైన్ నేలపాలు..  - MicTv.in - Telugu News
mictv telugu

మందుబాబులకు కన్నీళ్లు.. 50వేల లీటర్ల వైన్ నేలపాలు.. 

September 26, 2020

Red wine 50,000-litre tanks bursts at a winery in Spain and unleashes a flood of red wine

మద్యం ఎంత విలువైందో మందుబాబులకు తెలిసినట్టు మరొకళ్లకు తెలియదు. రెండు చుక్కలు గ్లాసులో కాకుండా పక్కన పడితే గుండెలు తరుక్కుపోతాయాయి. సీసా ఖాళీ అయినా తిరగేసి టపటపా కొడుతూ లక్కీ డ్రాప్స్ కోసం నానా కుస్తీ పడతారు. అలాంటిది ఏకంగా 50 వేల లీటర్ల మద్యం నేలపాలైతే. అది కూడా మాంచి రెడ్ వైన్ అయితే? 

ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూడండి. స్పెయిన్‌లోని విలామెలేయా ప్రాంతంలో ఉన్న వితివినోస్‌ కంపెనీలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. మద్యం ట్యాంకులో లోపం వల్ల పైపు పగలడంతో వైన్ బుస్సున ఎగజిమ్మి నేలపాలైంది. అక్కడి ఉద్యోగులు దిక్కుతోచక అలాగే చూస్తుండిపోయారు. వైన్ పొంగిపొర్లి చుట్టుపక్కల ప్రాంతాలకు వరదలా పాకిపోయింది. ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పడేయగా మందుబాబులు కన్నీళ్లతో చూస్తున్నారు. కొందరైతే నేలపాలైన మందును వైన్ సునామీ అని, రక్తకన్నీళ్లని అభివర్ణిస్తున్నారు. వితివినోస్ ఫ్యాక్టరీలో రోజూ టన్నుల కొద్దీ ద్రాక్షలను వేల లీటర్ల వైన్‌గా మార్చేస్తుంటారు.