మా మనోభావాలు దెబ్బతిన్నాయ్..! - MicTv.in - Telugu News
mictv telugu

మా మనోభావాలు దెబ్బతిన్నాయ్..!

August 19, 2017

కొందరు రాజ్యాంగ బద్దమైన పదవుల్లో ఉంటూ రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరిచేలా చర్చలు చేస్తున్నారని  రెడ్డి జాగృతి అధ్యక్షుడు పిట్టా శ్రీనివాస్ రెడ్డి .. తెలంగాణ  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి సింగ్ కు ఫిర్యాదు చేశారు.

ఇటీవల ఓ తెలంగాణ టీవీ చానల్ నిర్వహించిన చర్చలో కుల ప్రస్తావనలు తీసుకొచ్చి రెడ్డి కులస్తుల మనోభావాలను దెబ్బతీశారని సింగ్ కు ఓ లేఖలో తెలిపారు. చర్చల్లో పాల్గొన్న వారు తమ  స్వార్ధ ప్రయోజనాల కోసం నోటికొచ్చినట్లు మాట్లాడారని ఆరోపించారు.

చర్చలో పాల్గొన్నవీరమల్లు ప్రకాశ్ రావ్(డైరెక్టర్&చైర్మన్ ఆఫ్ వాటర్ రిసోర్స్ డెవలప్ మెంట్ కార్పోరేషన్),  దేశపతి శ్రీనివాస్(తెలంగాణ  రాష్ట్ర ముఖ్యమంత్రి  ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ), దేవీప్రసాద్ రావు(చైర్మన్,తెలంగాణ బీవరేజెస్ కార్పోరేషన్), అల్లం నారాయణ(చైర్మన్,తెలంగాణ ప్రెస్ అకాడమీ)లను  తక్షణం వారి పదవుల నుంచి ప్రభుత్వం బర్తరఫ్ చేయాలని పిట్టా శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు.  కులరహిత సమాజం అంటూ కుల రాజకీయాలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని, దీనిపై వెంటనే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని  కోరారు.