షియోమి కంపెనw తన నూతన స్మార్ట్ ఫోన్ ఈరెడ్ మి నోట్ 4 లేక్ బ్లూ’ ను కొత్త వేరియంట్ ను లాంచ్ చేసింది. దీన్ని భారత్ మార్కెట్లో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఎం.కామ్, ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్లో అందుబాటులోకి ఉంటుంది. దీని ధర రూ. 12,999 గా కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్ల అమ్మకం ద్వారా వచ్చే లాభాల్లో కొంత మొత్తాన్ని నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న బెంగళూరు సమస్యల పరిష్కారానికి కేటాయిస్తారు. చెరువుల పునర్ నిర్మాణానికి, స్వచ్ఛ అభియాన్ కు మద్దతుగా ఈ ప్రాజెక్ట్ ను లాంచ్ చేసినట్టు షియోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జైన్ ప్రకటించారు.
రెడ్ మినోట్ 5 లేక్ బ్లూ ఫీచర్లు…
5.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ ఐపిఎస్ డిస్ ప్లే 1080×1920 పిక్సల్ రిజల్యూషన్.
2.5 డి కర్వడ్ గ్లాస్ స్నాప్ డ్రాగన్ 625 4జీబీ ర్యామ్.
64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రో ఎస్ డీ కార్డ్ తో ఎక్స్ పాండబుల్ మెమెురీ.
13 మెగాపిక్సల్ రియల్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా.
4100 ఎంఏహెచ్ బ్యాటరీ.