రెడ్ మి నుంచి మరో ఫోన్.. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లు - MicTv.in - Telugu News
mictv telugu

రెడ్ మి నుంచి మరో ఫోన్.. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లు

September 15, 2020

redd

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రెడ్ మీ మరో బడ్జెట్ ఫోన్ ను ఈరోజు భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. రెడ్ మి 9 సిరీస్ లో భాగంగా ‘రెడ్ మి 9ఐ’ పేరుతో ఈ ఫోన్ ను లాంచ్ చేసింది. ఇప్పటికే రెడ్ మి 9, రెడ్ మి 9ఏ, రెడ్ మి 9ప్రైమ్ ఫోన్లను లాంచ్ చేసిన సంగతి తెల్సిందే. ముఖ్యంగా ‘బిగ్ ఆన్ ఎంటర్టైన్మెంట్’ అనే కాన్సెప్ట్ తో ఈ కొత్త మొబైల్ ను తీసుకుని వచ్చింది. ఈ ఫోన్ రెండు మెమొరీ వేరియంట్ లలో లభించనుంది. 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ధరను రూ. 8,299గా నిర్ణయించింది. మరో వేరియంట్ 4జీబీ ర్యామ్, 128 ఇంటర్నల్ స్టోరేజ్ ధర తెలియాల్సి ఉంది. ఈ ఫోన్ ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్, ఎంఐ.కామ్ లలో లభ్యం కానుంది. ఈ నెల 18న ఈ ఫోన్ మొదటి సేల్ జరుగనుంది.

రెడ్ మి 9ఐ ఫీచర్లు

 

* 6.53 ఇంచెస్ డిస్ప్లే,

* 4 జీబీ ర్యామ్, 64 జీబీ/ 128 ఇంటర్నల్ స్టోరేజ్,

* మీడియా టెక్ హీలియో జీ 25 ప్రాసెసర్,

* 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా,

* 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా,

* 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.