రెడ్‌మీ నుంచి 5జీ ఫోన్..ధర సరసమే! - MicTv.in - Telugu News
mictv telugu

రెడ్‌మీ నుంచి 5జీ ఫోన్..ధర సరసమే!

December 10, 2019

Redmi K30 will launch today

ప్రముఖ స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థ షియోమీ దూకుడు పెంచింది. ఇప్పటికే ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలో ఫోల్డ్ ఫోన్ మార్కెట్‌లోకి రానుంది. ఇంతలో షియోమీ 5జీ ఫోన్‌లను తీసుకొని వచ్చింది. ఈరోజు చైనా మార్కెట్‌లో 5జీ వేరియెంట్ ఫోన్లను విడుదల చేసింది. రెడ్‌మీ కె30, రెడ్‌మీ కె30 5జీ పేరిట షియోమీ రెండు ఫోన్లను విడుదల చేస్తుంది. కె30 5జీ వేరియెంట్‌లో 5జీ ఫీచర్‌ను తీసుకొచ్చింది. 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ రెడ్‌మి కే30 5జీ స్మార్ట్‌ఫోన్ ధర ఇండియాలో రూ.20,100గా ఉండనుంది. అలాగే 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ రెడ్‌మి కే30 4జీ స్మార్ట్‌ఫోన్ రూ.16,100 ఉండనుంది. 

 

కె30 ఫోన్ ఫీచర్స్ 

* మొదటి రౌటర్,

* హోల్-పంచ్ డిస్‌ప్లే,

* స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్,

* 6.67 ఇంచుల డిస్‌ప్లే,

* ఆండ్రాయిడ్ 10 ఓఎస్,

* 20+2 మెగా పిక్సల్ డ్యూయల్ సెల్ఫీ కెమెరాలు,

* 64+2+8+2 మెగా పిక్సల్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్,

* 4,500ఎంఏహెచ్ బ్యాటరీ.