రెడ్‌మీ ఫోన్‌లో మంటలు - MicTv.in - Telugu News
mictv telugu

రెడ్‌మీ ఫోన్‌లో మంటలు

February 6, 2020

MI..

గతంలో రెడ్‌మీ స్మార్ట్ ఫోన్లు కాలిపోయిన ఘటనలు వెలుగులోకి వచ్చిన సంగతి తెల్సిందే. ఆ తరువాత ఎక్కడా ఈ ఫోన్‌లు కాలిపోతున్న సంఘటనలు జరుగలేదు. తాజాగా ఓ రెడ్‌‌మీ స్మార్ట్‌ఫోన్ కాలిపోయిన ఘటన గుజరాత్‌లో వెలుగులోకి వచ్చింది. 

రెడ్‌మీ నోట్ 6 ప్రో ఫోన్‌ను రిపేర్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రిపేర్ చేసే వ్యక్తి ఫోన్‌ను తెరవడానికి ప్రయత్నించగా.. ఆ ఫోన్ నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. అయితే ఈ ఘటనలో ఎవ్వరికీ ఎటువంటి గాయాలు కాలేదు. కానీ ఫోన్ మాత్రం కాలిపోయింది. ఈ ఘటనపై షియోమీ అధికారులు స్పందించారు. షియోమీలో వినియోగదారుల భద్రతకు పూర్తి ప్రాధాన్యతను ఇస్తామని, అటువంటి విషయాలను తాము చాలా సీరియస్‌గా తీసుకుంటామని షియోమీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఘటన తమ దృష్టికి వచ్చిన వెంటనే తమ బృందం ఆ వినియోగదారుడిని సంప్రదించిందని తెలిపింది. ఆ వినియోగదారుడితో ఉన్న సమస్యను పరిష్కరించామని, దీనికి సంబంధించిన వివాదాలన్నీ పరిష్కారమైనట్లు షియోమీ ప్రతినిధులు తెలిపారు.