‘రెడ్‌మి నోట్‌ 8’ నుంచి కొత్త వేరియంట్‌ - MicTv.in - Telugu News
mictv telugu

‘రెడ్‌మి నోట్‌ 8’ నుంచి కొత్త వేరియంట్‌

November 27, 2019

 

Redmi Note 8 Cosmic Purple Colour Variant Launched in India Price, Specifications

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమి నుంచి రెడ్‌మి నోట్ 8 ఫోన్ విడుదలైన సంగతి తెల్సిందే. తాజాగా ఈ ఫోన్‌లో కాస్మిక్‌ పర్పుల్‌ వేరియంట్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. రెడ్‌మి నోట్ 8 కాస్మిక్ పర్పుల్ కలర్ వేరియంట్ అమెజాన్‌, ఎంఐ.కాం ద్వారా నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు అందుబాటులో ఉండనుంది. కొత్త కాస్మిక్ పర్పుల్ కలర్ ఎంపికతో పాటు, ఇతర కలర్‌ ఆప్షన్లలో కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌ లభిస్తుంది. ఈ ఫోన్ 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.9,999 కాగా 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ రూ. 12,999 గా నిర్ణయించారు.

రెడ్‌మి నోట్ 8 ఫీచర్లు

* 6.39 అంగుళాల ఫుల్‌ హెచ్‌డి డిస్‌ప్లే,
* 1080×2280 పిక్సెల్స్ రిజల్యూషన్‌,
* ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 సాక్‌,
* ఆండ్రాయిడ్ 9 పై,
* 48+8+2+2 మెగా పిక్సెల్ క్వాడ్‌ కెమెరా,
* 13 ఎంపీ సెల్పీ కెమెరా,
* 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.