9 సిరీస్ లో షియోమీ నుంచి మరో ఫోన్! - MicTv.in - Telugu News
mictv telugu

9 సిరీస్ లో షియోమీ నుంచి మరో ఫోన్!

July 14, 2020

redmi

ప్రముఖ చైనీయ మొబైల్ తయారీ సంస్థ షియోమీ 9 సిరీస్ లో రెడ్‌మీ నోట్‌ 9 ప్రో, రెడ్‌మీ నోట్‌ 9 ప్రో మాక్స్ పేరుతో రెండు ఫోన్లను విడుదల చేసిన సంగతి తెల్సిందే. తాజాగా ఈ సిరీస్ లో రెడ్‌మీ నోట్‌ 9 పేరుతో మరో స్మార్ట్‌ఫోన్‌ను జూలై 20న భారత్‌లో విడుదల చేయనున్నట్లు షియోమీ ప్రకటించింది. ఈ ఫోన్ ను బడ్జెట్‌ ధరలో అందుబాటులోకి తీసుకుని రానున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. రెడ్‌మీ నోట్‌ 9 డిజైన్‌ ఈ సిరీస్ లో వచ్చిన రెండు మోడళ్ల మాదిరిగానే ఉంటుంది. కొన్నినెలల క్రితమే రెడ్‌మీ నోట్‌ 9 ఫోన్‌ను ప్రపంచవ్యాప్తంగా లాంచ్‌ చేసింది. కరోనా మహమ్మారి వల్ల ఇండియాలో ఈ ఫోన్ లాంచ్ ఆలస్యం అయింది. ఈ ‌ఫోన్‌ ధర రూ.15 వేలలోపే ఉండనుంది.  ఈ ఫోన్ రెండు మెమరీ వేరియంట్లలో లభించనుంది. ఇందులో వెనుకవైపు నాలుగు కెమెరాలు ఉండనున్నాయి. ముందు వైపు పంచ్ హోల్ సెల్ఫీ కెమెరాను అమర్చారు.

 

రెడ్‌మీ నోట్‌ 9 ఫీచర్లు

 

* 3జీబీ+64జీబీ, 4జీబీ+128జీబీ,

* ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం,

* 6.53 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఐపీఎస్ డిస్ ప్లే, 

* మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్, 

* 5020 ఎంఏహెచ్ బ్యాటరీ