రెడ్‌మి నోట్ 9ప్రో సునామీ.. 90 సెకన్లలోనే అయిపోయాయ్.. - MicTv.in - Telugu News
mictv telugu

రెడ్‌మి నోట్ 9ప్రో సునామీ.. 90 సెకన్లలోనే అయిపోయాయ్..

March 17, 2020

c vb nvbnvb

రెడ్‌మి నుంచి వచ్చిన కొత్త ఫోన్ ‘రెడ్‌మి నోట్ 9 ప్రొ’‌ విశేషంగా అమ్ముడుపోయింది. 90 సెకన్లలోనే ఫోన్లన్నీ అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. గత వారమే ఈ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ రోజు అమెజాన్ ఇండియాలో  నిర్వహించిన ఫస్ట్‌సేల్‌లో ఫోన్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. స్నాప్‌డ్రాగన్ 720జి ఎస్ఓసీ, 5,020 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి అదనపు ఆకర్షణలు వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. అమెజాన్‌తో పాటు ఎంఐ డాట్‌కామ్, ఎంఐ హోం, ఎం స్టూడియో స్టోర్లలోనూ ఈ ఫోన్ కొనుగోళ్ల సునామీ సృష్టించింది. దీంతో స్టాక్ ముగిసింది. మరోసేల్‌ను ఈ నెల 24న నిర్వహించనున్నట్టు షియోమీ ఇండియా చీఫ్ మనుకుమార్ జైన్ తెలిపారు. 

అమెజాన్‌లో ఈ ఫోన్లు విక్రయానికి పెట్టిన 90 సెకన్లలోనే అమ్ముడుపోయినట్టు మను కుమార్ జైన్ ట్వీట్ చేశారు. 4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.12,999 కాగా, 6జీబీ + 128 జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ.15,999గా నిర్ణయించారు. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా హెచ్‌డీఎప్‌సీ బ్యాంకు కార్డులు, ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై రూ.1000 డిస్కౌంట్ అందిస్తోంది. ఎయిర్‌టెల్ రూ.298, రూ.398  అన్‌లిమిటెడ్ ప్యాక్‌లపై డబుల్ డేటా వంటి ప్రయోజనాలను సైతం అందిస్తోంది. 

రెడ్‌మి నోట్ 9 ప్రొ ఫీచర్లు ఇలా.. 

-6.67 అంగుళాల ఫుల్ హెడ్‌డీ ప్లస్ ఐపీఎల్ డిస్‌ప్లే

-48 ఎంపీ ప్రధాన సెన్సార్‌, 48 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వెనక నాలుగు కెమెరాలు

-ముందువైపు 16 మెగాపిక్సల్ కెమెరా

-కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్

-512 జీబీ వరకు మెమొరీని పెంచుకునే అవకాశం

-5,020 ఎంఏహెచ్ బ్యాటరీ 

వంటి ఫీచర్లు ఉన్నాయి.