అదిరిపోయే ఫీచర్లతో 'ఎంఐ నోట్ 10 లైట్' వచ్చేసింది! - Telugu News - Mic tv
mictv telugu

అదిరిపోయే ఫీచర్లతో ‘ఎంఐ నోట్ 10 లైట్’ వచ్చేసింది!

April 30, 2020

Redmi Note 9 series and Mi Note 10 Lite announcement

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ ఎంఐ నోట్ 10 లైట్ పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఇప్పటికే ‘ఎంఐ నోట్ 10’, ‘ఎంఐ నోట్ 10 ప్రో’ లను లాంచ్ చేసిన సంగతి తెల్సిందే. ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో లభించనుంది. 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 349 యూరోలుగా(సుమారు రూ.29,000) నిర్ణయించగా.. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 399 యూరోలుగా(సుమారు రూ.33,100) నిర్ణయించారు. ఈ స్మార్ట్ ఫోన్ మిడ్ నైట్ బ్లాక్,  గ్లేసియర్ వైట్, నెబ్యులా పర్పుల్ రంగుల్లో ఈ స్మార్ట్ ఫోన్ లభించనుంది. ఈ ఫోన్ సేల్ మే నెలలో ప్రారంభం కానుంది. భారత మార్కెట్ లో కూడా ఈ ఫోన్ త్వరగా లాంచ్ కానుందని సమాచారం.

ఎంఐ నోట్ 10 లైట్ ఫీచర్లు

* 6.47 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ కర్వ్‌డ్ అమోఎల్ఈడీ డిస్ ప్లే, 

* క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 730జీ ప్రాసెసర్, 

* ఇంటర్నల్ స్టోరేజ్ 64 జీబీ, 128 జీబీ, 

* 64+8+2+5 మెగా పిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్, 

* 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా,

* ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్,

* ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం, 

* 5260 ఎంఏహెచ్ బ్యాటరీ.