దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. గతకొన్ని రోజులుగా ఉక్రెయిన్, రష్యా యుద్దం కారణంగా పరుగులు పెట్టిన ధరలు, కొంచెg కొంచెంగా తగ్గుతూ వస్తున్నాయి. బంగారం, వెండి కొనాలని ఆశగా ఎదురుచూస్తున్న వారిని బంగారం షాపుల వైపు నడిపిస్తున్నాయి. హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,450 నుంచి 450 తగ్గి, 48,000కు చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 52,860గా నుంచి 490 తగ్గి 52,370కి చేరింది.
మరోపక్క అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గణనీయంగా పెరుగుతూ, రూపాయి విలువను హరించేస్తున్నాయి. ముడి చమురు ధర బ్యారెల్ 129 డాలర్లకు చేరుకోవడంతో అది ఫారెక్స్ మార్కెట్లో రూపాయిపై ఒత్తిళ్లకు దారితీసింది. డాలర్ మారకంలో రూపాయి విలువ జీవిత కాలంలో అత్యంత కనిష్ఠానికి చేరింది.