తగ్గిన వెండి ధర.. నిలకడగా బంగారం - MicTv.in - Telugu News
mictv telugu

తగ్గిన వెండి ధర.. నిలకడగా బంగారం

March 8, 2022

ఉక్రెయిన్‌ – రష్యా దేశాల మధ్య నెలకొన్న యుద్ధం కారణంగా గత కొన్ని రోజులుగా పసిడి పరుగులు పెడుతోన్న సంగతి తెలిసిందే. వెండి కూడా అదే దారిలో నడుస్తోంది. ఈ మేరకు సోమవారం బంగారం, వెండి ధరలు కొద్దిగా పెరిగిన, మంగళవారం బంగారం ధర స్థిరంగా ఉన్నా, వెండి ధర మాత్రం కాస్త తగ్గింది. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో మార్పులు ఏమీ లేవు. ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,400 ఉండగా,10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 53,890గా ఉంది.

ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 22 కేరట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1000 పెరిగి రూ. 49,400 చేరింది. 24 కేరట్ల బంగారం రూ. 1,090 పెరిగి రూ. 53,890 వద్ద నిలిచింది. కిలో వెండి ధర 1,100 తగ్గి రూ. 74,600 పలుకుతోంది. మరోపక్క అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గణనీయంగా పెరుగుతూ రూపాయి విలువను హరించేస్తున్నాయి. ముడి చమురు ధర బ్యారెల్ 129 డాలర్లకు చేరుకోవడంతో అది ఫారెక్స్ మార్కెట్లో రూపాయిపై ఒత్తిళ్లకు దారితీసింది. డాలర్ మారకంలో రూపాయి విలువ జీవిత కాలంలో అత్యంత కనిష్ఠానికి చేరింది.