బిగ్‌బాస్‌‌లోకి  పసుపు చీర పోలింగ్ అధికారి.. - MicTv.in - Telugu News
mictv telugu

బిగ్‌బాస్‌‌లోకి  పసుపు చీర పోలింగ్ అధికారి..

May 18, 2019

పసుపు రంగు చీరతో ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయిన రీనా ద్వివేదీ.. బిగ్‌బాస్ 13 కంటెస్టెంట్‌గా చేయ్యాలనుకుంటున్నట్లు పేర్కొంది. రీనా ద్వివేదీ అంటే వేరే ఎవరో అనుకుంటున్నారా? అదేనండీ.. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల్లో విధులు నిర్వహించారు కదా ఆమె.

ఆ ఒక్కరోజులు రీనా వరల్డ్ ఫేమస్ అయిపోయారు. పసుపు రంగు చీర, నల్ల కళ్లద్దాలు, ఓ చేతిలో ఈవీఎం బాక్సు, మరో చేతిలో సెల్ ఫోన్ పట్టుకుని వెళ్తున్నప్పుడు కొందరు తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. ఆ ఒక్క ఫొటోతోనే ఆమె అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆ తర్వాత అనేక మంది ఆమె కోసం గుగూల్, ఫేస్‌బుక్‌లో వెతికినా దొరకలేదు.. అయితే ఈమెకు సంబంధించిన కొన్ని వీడియోలు టిక్ టాక్‌లో లభ్యమవడంతో మరింత ఫేమస్ అయిపోయింది. యూపీలోని దేవరియాకు చెందిన రీనా.. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తోంది.

తాజాగా రీనా ఓ చానల్ లో ఇంటర్వ్యూ ఇస్తూ.. ‘నాకు బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా చెయ్యాలని ఉంది. నాలోని టాలెంట్ బయటపెట్టేందుకు బిగ్ బాస్ ఉపయోగపడుతుంది. అందుకే అందులోకి వెళ్లాలి అనుకుంటున్నాను. నా కుటుబం నాకు మంచి గుర్తింపు రావాలని కోరుకుంటుంది’ అని రీనా ద్వివేదీ పేర్కొంది. రీనా కొడుకు ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నాడు. తన తల్లిని పసుపు రంగు చీర మహిళ (woman in yellow saree) అని పిలవడం సంతోషంగా ఉందంటున్నాడు. రీనా ప్రస్తుతం గూగుల్ ట్రెండ్‌లో టాప్‌ లిస్ట్‌లో ఉంది.