Register through NEET UG Notification Release Direct Link
mictv telugu

NEET UG 2023: వైద్య విద్యార్థులూ..నీట్ యూజీ నోటిఫికేషన్ రిలీజ్..వెంటనే రిజిస్టర్ చేసుకోండి

March 7, 2023

Register through NEET UG Notification Release Direct Link

వైద్యవిద్యార్థులకు అలర్ట్. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నోటిఫికేషన్ సోమవారం రిలీజ్ అయ్యింది. నీట్ యూజీ పరీక్షను మే 7న నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. తాజాగా అధికారికంగా నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. MBBS,BDS,BS,MS,BUMS, BHMS కోర్సుల్లో ప్రవేశాల కోసం, ఇంగ్లీష్, హిందీ, తెలుగుతోపాటు మొత్తం 13భాషల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. పెన్ను, పేపర్ విధానంలో ఈ పరీక్ష నిర్వహిస్తారు. అడ్మిట్ కార్డులు డౌన్ లోడ్, పరీక్ష కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని ఎన్టీఏ వెబ్ సైట్లో పొందుపరచనున్నారు.

నీట్ మే పరీక్ష మే 7న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల మధ్య జరగనుంది. అయితే గత ఐదేళ్లుగా ఈ పరీక్ రాసేవారికి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఆక్రమంలోనే గతేడాది 17.64లక్షల మంది నీటి యూజీ పరీక్ష రాశారు. ఈ ఏడాది 18లక్షల మంది రాసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

అర్హతలు
నీట్ పరీక్ష రాసే విద్యార్థులు 50శాతం మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సంబంధిత గ్రూపులతో ఇంటర్మిడియేట్ ఉత్తీర్ణులై ఉండాలి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగుల అభ్యర్థులకు 40శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి. విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తిచేసి భారత్ లో ఉద్యోగం చేసేందుకు రెడీగా ఉన్న భారతీయ విధ్యార్థులు విదేశీ విద్యార్థులు కూడా నీట్ క్వాలిఫై తప్పనిసరిగా ఉండాల్సిందే.

వయోపరిమితి
అభ్యర్థుల వయస్సు 31.13.2023నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగుల అభ్యర్థులకు ఐదేళ్ల వయోసడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం
ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ పేజీని డౌన్ లోడ్ చేసుకోవాలి. అప్ లోడ్ చేసిన కాపీని కూడా మీ దగ్గరే ఉంచుకోంది. తదుపరి అవసరాలకు ఉపయోగపడుతుంది.

ఫీజు
జనరల్ కేటగిరి రుసుము రూ. 1700
జనరల్ ఈ డబ్యూఎస్ రూ. 1600
ఎస్సీ,ఎస్టీ, థర్డ్ జెండర్ రూ. 100
విదేశాలకు చెందిన అభ్యర్థులు రూ. 9,500

ముఖ్యమైన తేదీలు
1. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ 06.0.3.2023
2. ఆన్ లైన్ దరఖాస్తు చివరి తేదీ 06.04.2023