విచిత్రం..సూర్య సినిమాల్లో చెప్పినట్టే జరుగుతుంది! - MicTv.in - Telugu News
mictv telugu

విచిత్రం..సూర్య సినిమాల్లో చెప్పినట్టే జరుగుతుంది!

May 28, 2020

Relationship between coronavirus outbreak and surya movies

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి ప్రభావం తగ్గకముందే భారత్ లోని కొన్ని రాష్టాలపై మిడితలు దాడి చేస్తున్నాయి. అయితే, సూర్య సినిమాల్లో జరిగినట్టే ప్రస్తుతం జరుగుతున్నాయని నెటిజన్లు అంటున్నారు. సూర్య, మురగదాస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘సెవంత్ సెన్స్’ సినిమాలో కూడా ఒక వైరాస్ భారత దేశాన్ని గడగడలాడిస్తుంది అని చూపించారు. చైనా నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఆ వైరస్ ఒక కుక్క ద్వారా ప్రజలందరికి వ్యాపింప చేస్తాడు. దానికి హీరో విరుగుడు కనిపెడతాడు. ఇప్పుడు కరోనా వైరస్ కూడా చైనా నుంచి ప్రబలడంతో నెటిజన్లు ఈ సినిమాకు లింక్ పెడుతున్నారు.

అలాగే ప్రస్తుతం భారత్ లోని కొన్ని రాష్ట్రాలను భయపెడుతోన్న మిడతల దండును కూడా సూర్య నటించిన “కప్పాన్” (తెలుగులో బందోబస్త్) సినిమాలో చూపించారు. ఇలా సూర్య నటించిన రెండు సినిమాల్లో రెండు వివత్తుల గురించి చూపించడంతో సోషల్ మీడియాలో సూర్య సినిమాలు సంబందించిన వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.