ఐన్‌స్టీన్ సిద్ధాంతానికంటే గొప్పది వేదాల్లో ఉందన్న స్టీఫెన్ హాకింగ్ - MicTv.in - Telugu News
mictv telugu

ఐన్‌స్టీన్ సిద్ధాంతానికంటే గొప్పది వేదాల్లో ఉందన్న స్టీఫెన్ హాకింగ్

March 16, 2018

సైన్స్, టెక్నాలజీ రంగాల్లో కీలక ఆవిష్కరణలకు దోహదపడిన సాపేక్ష సిద్ధాంతం కంటే గొప్ప సిద్ధాంతం భారతీయ వేదాల్లో ఉందని మొన్న చనిపోయిన విఖ్యాత భౌతిక శాస్త్రవేత్త  స్టీఫెన్ హాకింగ్ చెప్పాడట! కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి హర్ష్ వర్థన్ ఈ విషయం తెలిపారు. స్టీఫెన్ ఎక్కడ అలా చెప్పారని విలేకర్లు వివరణ కోరగా.. ‘ఆ సంగతి మీరే తెలుసుకోండి’ అని మంత్రి బదులిచ్చారు.ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని ( e=mc^2) ప్రతిపాదించడం తెలిసిందే. స్టీఫెన్ మరణం నేపథ్యంలో ఆయన భారతీయ గ్రంథాలను ఎంతో గౌరవించేవాడని వార్తలు వస్తున్నాయి. 105వ భారత సైన్స్ కాంగ్రెస్‌లో హర్ష వర్ధన్ ఈ విషయాలను ప్రస్తావించారు. ‘మనం గొప్ప శాస్త్రవేత్తను కోల్పోయాం. ఐన్‌స్టీన్ సిద్ధాంతం కంటే గొప్ప సిద్ధాంతం మన వేదాల్లో ఆయన ఆన్ రికార్డ్‌గా చెప్పారు.. ’ అని అన్నారు. దీనికి ఆధారమేంటని విలేకర్లు అడగ్గా.. మీరే కనుక్కోండని అన్నారు. కనుక్కోలేకపోతే ఢిల్లీలో తనను కలుసుకోవాలన్నారు.