పెళ్లిలో కుంపట్లు.. పూర్తిగా చదవండి.. - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లిలో కుంపట్లు.. పూర్తిగా చదవండి..

January 17, 2020

Wedding.

పెళ్లి కాగానే వేరుకుంపట్లు పెట్టే వాళ్లు చాలామందే ఉన్నారు కనుక ఇది కూడా అలాంటి వార్తేనని పొరపడకండి. ఇది చలి కాలానికి సంబంధించిన వార్తే.. అసలే ఎముకలు కొరుకుతున్న చలి. ఈ చల్లని చలిలో పెళ్లిళ్లకు పోవాలంటే మాటలు కాదు కదా. ఇంత చలిలో ఏం పెళ్లికి వెళ్తాంలే.. చక్కగా నిండా రగ్గు కప్పుకుని వెచ్చగా తొంగుందాం అనుకుని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నా చేసుకుంటారు. అలా చేస్తే తమ ఇంట సంబరం వెలవెలబోతుందని భావించింది గుజరాత్‌కు చెందిన రాజ్‌కోట్‌లోని ఓ కుటుంబం. అంతే వచ్చే బంధుమిత్రులకు చలి భయం లేకుండా చేసింది. 

పెళ్లికి వచ్చిన బంధువులకు చలి మంటలతో ఆతిథ్యం ఇచ్చింది. చిమ్నీని కూడా ఏర్పాటు చేసింది. ఇది కదా అసలు సిసలైన మర్యాద అని వచ్చినవారంతా నవదంపతులకు వెచ్చవెచ్చని దీవెనలు అందిస్తున్నారు. భలే ఉంది కదా వారికి వచ్చిన ఈ ఐడియా.