Relatives tried to bury mother and daughter alive for property in Srikakulam
mictv telugu

శ్రీకాకుళంలో అమానుషం.. స్థలం కోసం తల్లీకూతుళ్ల సజీవ సమాధికి యత్నం

November 7, 2022

Relatives tried to bury mother and daughter alive for property in Srikakulam

శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఇంటి స్థలం కోసం సమీప బంధువులు తల్లీకూతుళ్లను సజీవ సమాధి చేసేందుకు యత్నించారు. మూడు ట్రాక్టర్ల ఎర్ర మట్టి కుమ్మరించి హత్యాయత్నం చేశారు. బాధితులు చివరి నిమిషంలో గట్టిగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్న భవన నిర్మాణ కార్మికులు, స్థానికులు స్పందించి పారలతో మట్టి తొలగించి వారిని రక్షించారు.

మగ దిక్కు లేని తల్లీకూతుళ్లు దాలమ్మ, సావిత్రిలు తమ సొమ్ముతో కొంత ఇంటి స్థలాన్ని కొనుక్కోగా.. దానిని కబ్జా చేసేందుకు అదే గ్రామానికి చెందిన కొట్ర రామారావు, ఆనందరావు, ప్రకాశ్ రావులు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. అండగా ఎవరూ లేరని గ్రహించి ట్రాక్టరు లోడుతో చంపాలని చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తి కోసం ఏడేళ్లుగా గొడవ జరుగుతుందని పోలీసులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. అటు పోలీసులు స్పందిస్తూ.. స్టేషనుకి వచ్చి ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు.