ఏపీలో సంక్షేమ పథకాల క్యాలెండర్ విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో సంక్షేమ పథకాల క్యాలెండర్ విడుదల

March 25, 2022

jjjgtgh

ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సమావేశాలు నేటీతో ముగియనున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం జగన్ మోహన్ రెడ్డి పేదల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇచ్చిందని చేప్తూ.. 2022-23 సంవత్సరానికి గాను, ప్రజలకు అందే సంక్షేమ పథకాలపై అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేశారు. అంతేకాకుండా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ఈ సంక్షేమ క్యాలెండర్‌ను ప్రకటిస్తున్నట్లు జగన్ పేర్కొన్నారు. మరి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన ఆ సంక్షేమ పథకాల క్యాలెండర్‌లో ఏఏ పథకాలు ఉన్నాయో తెలుసుకుందామా..

సంక్షేమ క్యాలెండర్ వివరాలు:

1. 2022 ఏప్రిల్‌- వసతి దీవెన, వడ్డీలేని రుణాలు
2. మే- విద్యా దీవెన, అగ్రికల్చర్‌ ఇన్స్యూరెన్స్, రైతు భరోసా, మత్య్సకార భరోసా
3. జూన్‌- అమ్మఒడి పథకం
4. జులై- విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం, జగనన్న తోడు
5. ఆగస్ట్- విద్యా దీవెన, ఎంఎస్‌ఎంఈలకు ఇన్సెన్టివ్‌లు, నేతన్న నేస్తం
6. సెప్టెంబర్‌- వైఎస్సార్‌ చేయూత
7. అక్టోబర్‌- వసతి దీవెన, రైతు భరోసా
8. నవంబర్‌- విద్యా దీవెన, రైతులకు వడ్డీలేని రుణాలు
9. డిసెంబర్‌- ఈబీసీ నేస్తం,లా నేస్తం
10. 2023 జనవరి- రైతు భరోసా, వైఎస్సార్‌ ఆసరా, జగనన్న తోడు
11. ఫిబ్రవరి- విద్యా దీవెన, జగనన్న చేదోడు
12. మార్చి- వసతి దీవెన వంటి పథకాలను చేర్చారు.