ఏపీలో టీచర్లకు కొత్త మార్గదర్శకాలు విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో టీచర్లకు కొత్త మార్గదర్శకాలు విడుదల

June 11, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఆయా ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లుగా విధులు నిర్వహిస్తున్న వారికి జగన్ సర్కార్ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ శనివారం జీవో 117ను జారీ చేశారు. జాతీయ విద్యాహక్కు చట్టం, నూతన జాతీయ విద్యావిధానాలను అనుసరించి, పాఠశాలల పునర్వ్యవస్థీకరణలో భాగంగా టీచర్ల సర్దుబాటుకు పాఠశాల విద్యాశాఖ ఈ చర్యలు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. అంగన్‌వాడీ సెంటర్లు, నాన్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, గిరిజన సంక్షేమ స్కూళ్లను పునర్వ్యవస్థీకరణ చేస్తున్నట్లు వివరానలను వెల్లడించారు.

ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ మాట్లాడుతూ..”శాటిలైట్‌ ఫౌండేషనల్‌ స్కూల్, ఫౌండేషనల్‌ స్కూల్, ఫౌండేషనల్‌ స్కూల్‌ ప్లస్, ప్రీ హైస్కూల్‌, హైస్కూల్‌, హైస్కూల్‌ ప్లస్‌ పాఠశాలలుగా ఇవి పునర్వ్యవస్థీకరణ అవుతున్నాయి. వీటికి తగ్గ మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు, అవసరమైన సెకండరీ గ్రేడ్‌ టీచర్లను, సబ్జెక్టు టీచర్లను సమకూర్చేలా ప్రభుత్వం ఈ ప్రక్రియను చేపట్టింది. ఆయా జిల్లాల డీఈవోలు ముందుగా మండలం, పాఠశాల వారీగా విద్యార్థుల సంఖ్య, అవసరమైన టీచర్ల సంఖ్యతో జాబితాలను రూపొందించాలి. వీటి ఆధారంగా టీచర్లను సర్దుబాటు చేస్తారు. కొత్త విధానంలో ఆయా స్కూళ్లలో 9, 10 తరగతుల్లో 20 మందికి మించి విద్యార్థులున్న చోట డ్యూయల్‌ మీడియం ఉండాలి. అక్కడ అదనపు సెక్షన్‌ను ఏర్పాటు చేస్తాం” అని ఆయన అన్నారు.

1. ఏదైనా పోస్టు ఖాళీగా ఉండి మార్పు చేయాలని ప్రతిపాదిస్తే ఆ పోస్టును సదరు స్కూలుకు బదలాయించాలి.
2. ఖాళీ పోస్టు లేకుంటే ఆ స్కూలులోని టీచర్లలో జూనియర్‌ టీచర్‌ను బదిలీ చేయాలి.
3. పాఠశాలలోని సీనియర్‌ ఉపాధ్యాయుడు కొత్త పాఠశాలలో పనిచేయడానికి ఇష్టపడితే అతనినే బదిలీ చేయవచ్చు.
4. 1, 2 తరగతులకు 30 మంది వరకు విద్యార్థులుంటే ఒక ఎస్జీటీని నియమించాలి.
5.1, 2 తరగతుల్లో 31కు మించి విద్యార్థులుంటే 2వ టీచర్‌ను కేటాయించాలి.
6. ఆపై ప్రతి 30 మంది అదనపు విద్యార్థులకు మరో ఎస్జీటీని నియమించాలి.
7. ఫౌండేషనల్‌ (1, 2 తరగతులు) స్కూళ్లలో 10 మంది కన్నా పిల్లలు తక్కువగా ఉంటే వాటి విషయంలో ప్రతిపాదనలను కమిషనర్‌కు పంపించాలి.
8.3–8 తరగతుల వరకు 6 సెక్షన్లకు ఆరుగురు, 7 సెక్షన్లకు ఏడుగురు, 8 సెక్షన్లకు 8 మంది సబ్జెక్టు టీచర్లుగా స్కూల్‌ అసిస్టెంట్లను ఏర్పాటు చేయాలి.
9. సీనియర్‌ మోస్ట్‌ టీచర్‌ హెచ్‌ఎంగా వ్యవహరించాలి.
10.195 మందికన్నా ఎక్కువ మంది ఉంటే 3 కిలోమీటర్ల లోపు వేరే హైస్కూల్‌ లేకుంటే వీటిని హైస్కూళ్లుగా అప్‌గ్రేడ్‌ చేయాలి.
11.98 మందికన్నా పిల్లలు తక్కువగా ఉంటే ఎస్‌ఏ బదులు ఎస్జీటీలను కేటాయించాలి.
12. అన్ని ప్రీ హైసూ్కళ్లను 8వ తరగతి వరకు అప్‌గ్రేడ్‌ చేయాలి.