తెలంగాణలో ఉన్న అన్ని బస్ డిపోలలో ఖాళీగా ఉన్న అప్రెంటీస్ పోస్టుల భర్తీకి టీఎస్ఆర్టీసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, దరఖాస్తు విధానం, అర్హతలు, ఎంపిక విధానం వంటి వివరాలు ఇలా ఉన్నాయి.
మొత్తం పోస్టులు : 300
పోస్టుల వివరాలు : ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, డిప్లొమా గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులు
అర్హతలు : గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఇంజినీరింగ్ డిప్లొమా/బీఈ/బీటెక్‌లో పాసవ్వాలి.
శిక్షణా కాలం : మూడు సంవత్సరాలు
వయో పరిమితి : జులై 1 2022 నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 35 ఏళ్ల వరకు ఉండాలి.
స్టైపెండ్ : (1) ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అభ్యర్ధులకు మొదటి సంవత్సరం నెలకు రూ. 18000, రెండో ఏడాది రూ. 20000, మూడో ఏడాది రూ. 22000 చొప్పున చెల్లిస్తారు.
(2) డిప్లొమా గ్రాడ్యుయేట్ అభ్యర్ధులకు మొదటి ఏడాది నెలకు రూ. 16000, రెండో ఏడాది రూ. 17500, మూడో ఏడాది రూ. 19000 చెల్లిస్తారు.
దరఖాస్తులు https://tsrtc.telangana.gov.in/ ఆన్లైన్ ద్వారా చేయాలి. మెరిట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.