‘అగ్నిపథ్’ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నేడు కీలక ప్రకటన చేసింది. ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ నియామకాలకు నోటిషికేషన్ విడుదల చేసింది. ఎయిర్‌ఫోర్స్, నేవీలో కూడా అగ్నివీర్ నియామకాల కోసం తేదీలను ప్రకటించింది. ఈ ఉద్యోగాలకు జులై నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. ఉద్యోగాలకు కావాల్సిన అర్హతలు, వయసు, విభాగాలు, వేతన ప్యాకేజీ, సెలవులు, సర్వీసు నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాలను నోటిషికేషన్లో పొందుపరిచినట్లు అధికారులు పేర్కొన్నారు.
మరోపక్క కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘అగ్నిపథ్’ పథకంపై కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ అగ్నిపథ్‌పై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అధికారులు ఇదివరకే స్పష్టం చేశారు. ఈ క్రమంలో నేడు నోటిఫికేషన్ జారీ చేశారు. వాయుసేన, ఇండియన్ నేవీలకు సంబంధించిన అగ్నివీరుల నియామాక నోటిఫికేషన్లు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి. నాలుగేళ్ల తర్వాత బయటకు వచ్చే అగ్నివీరులకు రక్షణశాఖ, కేంద్ర సాయుధ బలగాల నియామకాల్లోనూ 10 శాతం చొప్పున ప్రాధాన్యం కల్పిస్తామని ఇదివరకే కేంద్రం ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే.
అగ్నివీర్ రిక్రూట్మెంట్ నోటీఫికేషన్ తేదీలు..
1. ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ నోటిఫికేషన్.. జూన్ 20, 2022
2. ఇండియన్ నేవీ అగ్నివీర్ నోటిఫికేషన్.. జూన్ 21, 2022
3. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ నోటిఫికేషన్.. జూన్ 24, 2022